త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మండపేట పట్టణంలోని 19, 21వ వార్డులలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు గారు పాల్గొని ఇంటింటికీ వెళ్లి గత ఏడాది కాలంలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకుని, ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, కరపత్రాలను ప్రజలకు అందించారు. ప్రతీ కుటుంబాన్ని కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకొని, వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని నాయకులకు, అధికారులకు సూచించారు. అభివృద్ధిని ప్రతీ ఇంటికి చేరవేయాలనే సంకల్పంతో ఈకార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డు కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితర్లు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


