Godavarikhani SI Anusha : రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై గోదావరిఖని ఎస్‌ఐ అనూష అవగాహన

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ గోదావరిఖని ప్రతినిధి.. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా అరైవ్ – అలైవ్ క్యాంపెనింగ్ -2026 కార్యక్రమంలో భాగంగా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ప్రజలు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని గోదావరిఖని పట్టణ ఎస్‌ఐ అనూష గోదావరిఖని జిఎం ఆఫీస్ టర్నింగ్ వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్బంగా మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. రాంగ్ పార్కింగ్, ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ వంటి నిర్లక్ష్యపు చర్యల వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిని పూర్తిగా నివారించేందుకు వాహనదారులు నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి అని, మద్యం సేవించి వాహనం నడపడం నేరమని హెచ్చరించారు. అదేవిధంగా వాహన ధ్రువ పత్రాలు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్ ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలని తెలిపారు.

రాంగ్ పార్కింగ్ చేస్తే ట్రాఫిక్‌కు ఆటంకం కలుగుతుందని, ఆటో డ్రైవర్స్, ఇతర వాహనదారులు వెనకనుంచి వచ్చే వాహనాలను చూసుకోకుండా సడన్ గా యూ టర్న్ చేయడం, వాహనాలు బ్రేక్ వేయడం వలన ఇతర వాహనదారులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు.

ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రజలు పోలీస్ శాఖతో సహకరించి ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే ప్రమాదాలు తగ్గి, సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుందని ఎస్‌ఐ అనూష పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Godavarikhani SI Anusha's awareness on road safety

You cannot copy content of this page

Scroll to Top