Trinethram News : మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా గడ్డపోతారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం శంభీపూర్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగింది.
మాజీ మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల, బీఆర్ఎస్ పార్టీ గడ్డపోతారం మున్సిపల్ ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మరియు పటాన్ చెరువు నియోజకవర్గ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ టికెట్లు పూర్తిగా సర్వే ఆధారంగా, గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులకే ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు.
ప్రతి కార్యకర్త పార్టీ నియమాలు, క్రమశిక్షణకు లోబడి పనిచేస్తూ బీఆర్ఎస్ విజయానికి కృషి చేయాలని సూచించారు. ఇటీవల పార్టీ గుర్తు లేకుండా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారని, అదే స్ఫూర్తితో కారు గుర్తుతో జరిగే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మరింత ఘనమైన ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్కువ మంది సర్పంచులు గెలుపొందడం పార్టీ బలాన్ని స్పష్టంగా చూపిస్తోందని ఆయన తెలిపారు.
అదే క్రమంలో పార్టీ కార్యకర్తలు శక్తి వంచన లేకుండా కృషి చేసి, సమష్టిగా పనిచేస్తూ బీఆర్ఎస్ పార్టీని ఘన విజయం దిశగా నడిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జిన్నారం మాజీ జడ్పీటీసీ బాల్ రెడ్డి, గడ్డపోతారం మాజీ సర్పంచ్ ప్రకాష్ చారి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేస్తామని హామీ ఇచ్చారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


