డిండి (. గుండ్ల పల్లి) ఏప్రిల్ 24 త్రినేత్రం న్యూస్. లాలిత్యం ప్రైవేట్ హాస్పిటల్ వనస్థలిపురం హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా గుండ్లపల్లి డిండి మండల కేంద్రానికి పరిసర ప్రాంతంలో గల లిటిల్ మాస్టర్ స్కూల్ నందు వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉచిత వైద్య సేవలను అందించారు. పాఠశాలలోని దాదాపు 380 మంది బాలబాలికలకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులను అందజేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ విద్యార్థులు తమతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతినిత్యం తీసుకోవాలని సూచించారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు పాటించాలన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ పులిగిల్ల శ్రీపతిరావు, నాయకులు ఎటి కృష్ణ, శైలేష్, హాస్పిటల్స్ జిఎంలు కొండోజు శ్రీనివాసచారి, సంతోష్ పిల్లల వైద్య నిపుణులు అన్వేష్, సంతోష్ చారి, మార్కెటింగ్ మేనేజర్ నవీన్ చారి, క్యాంపు కో ఆర్డినేటర్ డీ మహేష్ గౌడ్, నర్సులు తదితరులు పాల్గొన్నారు.
ఈ క్యాంపు నిర్వహించినందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు ,పాఠశాల యాజమాన్యం, వారు లాలిత్యం హాస్పిటల్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


