Free Cancer Scanning Camp : ఉచిత క్యాన్సర్ స్కానింగ్ (స్క్రీనింగ్) శిబిరం

TRINETHRAM NEWS

తేదీ : 29/10/2025. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : (త్రినేత్రం న్యూస్); అశ్వరావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం, గండుగలపల్లి గ్రామపంచాయతీలో ఉన్నటువంటి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో శాసనసభ్యులు జారే. ఆదినారాయణ పిలుపుమేరకు, ఆయన సహకారంతోనే నియోజకవర్గ ప్రజల కోసం అక్టోబర్ ముప్పై వ తేదీ అనగా గురువారం సమయం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం సమయం మూడు గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. హైదరాబాద్ ప్రముఖ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ వైద్యశాల మరియు రీసే ర్చ్ ఇనిస్ట్యూట్ ఈ శిబిరాన్ని నిర్వహిస్తోంది అని తెలిపారు. క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స చేయడం ద్వారా సంపూర్ణంగా నయం చేయవచ్చని సూచించారు.
ఆ లక్షణాలు లేకున్నా ముందు జాగ్రత్తగా పరీక్ష చేయించుకోవడం అత్యవసరమని ఎమ్మెల్యే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముప్పై ఏళ్లు పైబడిన మహిళలు, పొగాకు ఉత్పత్తులు లేదా మద్యం చేయించే అలవాటు ఉన్నవాళ్లు , కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉన్నవాళ్లు కూడా, అదేవిధంగా అనారోగ్య లక్షణాలు, అసాధారణ మార్పులు గమనించిన వాళ్లు తప్పక రావాలని పేర్కొన్నారు. అనుభవజ్ఞులైన వైద్య బృందం ఉచితంగా క్యాన్సర్ స్కానింగ్, (స్క్రీనింగ్) పరీక్షలు చేసి, అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, జీవనానికి ముందస్తు పరీక్షలు తప్పనిసరిని శాసనసభ్యులు ఆదినారాయణ కోరారు.
మరిన్ని వివరాలకు : 040- 2355,(ఈ ఎక్స్ టిఎన్ 2354),
8008 ,305,599 లేదా 6301 147,817 నెంబర్లను సంప్రదించవచ్చున్నారు. ఆ వైద్యశాల బంజర హిల్స్ రోడ్డు నెంబర్ పది అని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Free Cancer Scanning (Screening) Camp

You cannot copy content of this page

Scroll to Top