
–దేవరకొండ – డిండి రహదారి పై బైక్ పైనుంచి పడి గాయపడిన వ్యక్తులు
-వాహనాన్ని ఆపి బాధితులను ఆదుకున్న మాజీ సర్పంచ్ శ్రీను నాయక్.
-వెంటనే 108కు సమాచారం.
-సకాలంలో స్పందించిన మాజీ సర్పంచ్ పై నేటిజెన్ల ప్రశంసలు.
Former Sarpanch : దేవరకొండ డివిజన్ నవంబర్ 04, త్రినేత్రం న్యూస్. రోడ్డు ప్రమాదంలో గాయపడి తీవ్రరక్తస్రావంతో బాధపడుతున్న వ్యక్తులను గమనించి వెంటనే స్పందించి సహాయం అందించడం ద్వారా మాజీ సర్పంచ్ నేనావత్ శ్రీను నాయక్ మానవత్వాన్ని చాటుకున్నారు.
బుధవారం సుమారు 9 గంటల ప్రాంతంలో దేవరకొండ నుంచి డిండి వెళ్ళే రహదారి పై బైకుపై ప్రయాణిస్తున్న వ్యక్తులు ప్రమాదవశాత్తు కిందపడి గాయపడ్డారు. ఈ ప్రమాదంలో బాధితులకు తీవ్ర రక్తస్రావమైనట్లు సమాచారం. అదే సమయంలో అటువైపు వెళుతున్న మాజీ సర్పంచ్ శ్రీను నాయక్ వెంటనే స్పందించి బాధితులను చూసి తమ వాహనాన్ని ఆపి, వారి వద్దకు వెళ్లి విషయాన్ని అడిగి తెలుసుకుని వైద్య చికిత్సల కోసం 108 వాహన సేవల కోసం సమాచారం అందించారు.
ప్రమాదంలో గాయపడిన బాధితులకు వారి కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుకొని గాయపడిన వారు దేవరకొండ పట్టణం జంగాల కాలనీకి చెందిన వారిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
—- శ్రీను నాయక్ పలువురు నెటిజన్ల అభినందనలు;—
ప్రమాదం జరిగిన సమయంలో అటుగా వెళుతూ క్షతగాత్రులలో గమనించి సహాయం అందించిన మాజీ సర్పంచ్ నేను నాయక్ స్పందన పై నేటిజన్లో ప్రశంసలు వ్యక్తం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe