Food Security : అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఆహార భద్రత కార్డులు

TRINETHRAM NEWS

ఎం ఎల్ ఏ బాలు నాయక్.
దేవరకొండ -( కొండ మల్లెపల్లి) జులై 31 త్రినేత్రం న్యూస్. కొండ మల్లెపల్లి లో ని సాయి కృప ఫంక్షన్ హాల్ లో ఆహార భద్రత కార్డుల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే బాలునాయక్ పంపిణీ చేశారు. అనంతరం కోల్ ముంత ల పహాడ్ గ్రామపంచాయతీ పరిధిలోగల బాపూజీ నగర్ లో నూతనంగా నిర్మించిన డ్రింకింగ్ వాటర్ సప్లై పైప్లైన్ ప్రారంభించారు. మరియు అంబేద్కర్ కాలనీ జేబీ కాలనీలో నూతనంగా నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గం పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మండల పార్టీ నాయకులు ,యువజన నాయకులు, మహిళలు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Food security cards for

You cannot copy content of this page

Scroll to Top