Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని 125 డివిజన్ గాజులరామారం , సుభాష్ చంద్రబోస్ నగర్ – ఎ లో కాలనీవాసుల విన్నపం మేరకు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గణేష్ టెంపుల్ నుండి చిల్లా వరకు, బస్వరాజ్ ఇంటి నుండి చాన్ ఇంటివరకు, శ్రీను ఇంటి నుండి చిల్లావరకు, ట్రాన్స్ఫర్మర్ నుండి చంద్రగిరి బార్డర్ వరకు 38 లక్షలతో సీసీ రోడ్లు సాంక్షన్ అయినందున ఆయా బస్తిలను పరిశీలించారు..
అనంతరం బస్తివాసుల సమస్యను సత్వరగా పరిష్కారించినందుకు కూన శ్రీశైలం గౌడ్ కి కృతఙ్ఞతలు తెలిపారు..
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ..
ఎన్నో సంవత్సరాల నుండి సుభాష్ చంద్రబోస్ నగర్ -ఎ లో కాలనీవాసులు రోడ్ల సమస్యతో ఇబ్బందిపడిన ఎ నాయకుడు పట్టించుకునే పాపానపోలే ఈ సమస్య నా దృష్టికి రాగానే సంబంధిత అధికారులతో మాట్లాడటం జరిగిందన్నారు..
ప్రభుత్వలు ఎన్ని మారిన కుత్బుల్లాపూర్ ప్రజల నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ అని గుర్తుచేసిన కాలానివాసుల అభిమానాన్ని మర్చిపోలేనన్నారు..
గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సారథ్యంలో ఇంచార్జ్ మంత్రివర్యులు శ్రీ దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు..
ఈ కార్యక్రమంలో బలరాం, జహంగీర్ భాయ్, పద్మా,గుమస్తా మధు, అభేద్, గట్టయ్య, డేవిడ్ రాజు, నాగరాజు, జర్జ్, రఘువీర్ రెడ్డి గార్లతో పాటు బస్తివాసులు తదితరులు పాల్గొన్నారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


