Dr. Suryanarayana Reddy : దోమాడ బాధితులను పరామర్శించి… సహాయం అందజేసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి

TRINETHRAM NEWS

అనపర్తి: త్రినేత్రం న్యూస్. ఒక్కో బాధిత కుటుంబంబానికి 25కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేశారు.

దోమాడ బాధితులకు బియ్యం పంపిణీ దోమాడలో నిరుపేదల ఇళ్లు కూల్చివేసి 9 రోజులు గడుస్తున్నా బీజేపీ ఎమ్మెల్యే, రామకృష్ణారెడ్డి, అధికార పార్టీకి చెందిన నాయకులు వచ్చి బాధితులను, పరామర్శించలేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ (వైయస్‌ఆర్‌సీపీ) అనపర్తి కో-ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనా రాయణరెడ్డి ఎద్దేవా చేశారు.

దోమాడ గ్రామంలో గృహాలు కోల్పోయిన బాధితులను మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి గురువారం పరామర్శించారు.

ఒక్కో బాధిత కుటుంబానికి 25 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి బాధితులు పరామర్శకు రాకుండా ఇతర ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని దుయ్యబట్టారు. పేదల ఇళ్ల కూల్చివేత దారుణం ప్రతి పేదవాడికీ ఇంటి స్థలం ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సంకల్పించారు.

ఆ ప్రకారం దోమాడలో 160 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు. ఇంకా 40 మంది అర్హులు ఉన్నారన్నారు. ఎన్నికలు రావడంతో మిగిలిన వారికి పట్టాలు ఇవ్వలేకపోయామన్నారు. స్థానిక పేద ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రైవేటు లేఔట్ అనుమతులు ఇవ్వాలని సూర్యనారాయణరెడ్డి అన్నారు. దౌర్జన్యంగా తెల్లవారుజామున పేదల ఇళ్లు కూల్చివేయడం దారుణమని ఆయన విమర్శిం చారు.

ఈ కార్యక్రమంలో దోమాడ సర్పంచ్ మీనవల్లి శారదదేవి, పార్టీ మండల కన్వీనర్ గుత్తుల రమణ, మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు కోసూరి వాసు, పార్టీ నాయకులు డొకుబుర్ర కృష్ణ, డి. అప్పారావు, పంపన రమణ, నియోజకవర్గం ఎస్సీ సెల్ కన్వీనర్ సాంబత్తుల చంటి తదితరులు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ (వైయస్‌ఆర్‌సీపీ) నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former MLA Dr. Sathi Suryanarayana Reddy

You cannot copy content of this page

Scroll to Top