తేదీ : 24/09/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఈ జిల్లా ఆటోనగర్ ఉన్న ఏకైక ప్రాంతం, అత్యధిక వాహనాలు కలిగి ఉన్న ఆర్డీవో కార్యాలయం గుడివాడే అని అసెంబ్లీలో శాసనసభ్యులు వెనిగండ్ల రాము వివరించారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నం దాటిన తర్వాత జిల్లా వాసులందరికీ దూరంగా ఏ పీ ఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు అని అన్నారు. చిన్న చిన్న సమస్యలకు డెబ్బై కిలోమీటర్ల దూరం వెళ్లి ఫిట్నెస్ చేయించుకోలేక నాన్న అవస్థలు పడుతున్నారని సూచించారు.
ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లన వాళ్లు కనీసం స్పందించడం లేదని తెలిపారు. వాళ్ల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ఆ కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గుడివాడలో ఏర్పాటు చేయడం వల్ల అన్ని ప్రాంతాల వాళ్లకు అందుబాటులో ఉంటుంది అన్నారు. దీని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు రూపాయలు ఆరు కోట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఈస్ట్ డిజిటల్ కార్యాలయం నిమిత్తం నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాల చిత్రాలను సభకు ఆయన చూపించారు. కొందరి అధికారుల నిర్లక్ష్యంతో గుడివాడ లాంటి అనేక నియోజకవర్గాలు అభివృద్ధికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయని చెప్పారు.
రాష్ట్రం మొత్తం సమగ్ర అభివృద్ధి చెందాలనేదే ముఖ్యమంత్రి నారా. చంద్రబాబు ఆకాంక్షని ప్రభుత్వానికి తెలియజేశారు. చిత్తశుద్ధి లేని అధికారుల కారణంగా ఆయన ఆశయాలకు అవంతరాలు ఏర్పడతాయని తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


