WhatsApp Image 2024 12 06 at 20.24.48
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ‘సిట్’ ఏర్పాటు
Trinethram News : అమరావతి : రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దర్యాప్తు బృందం ‘సిట్’ను ఏర్పాటు చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరుగురు సభ్యులతో కూడిన సిట్‌కు చీఫ్‌గా వినీత్ బ్రిజ్‌లాల్‌కు బాధ్యతలు అప్పగించారు..
సిట్ సభ్యులుగా సీఐడీ ఎస్పీ ఉమామహేశ్వర్, డీఎస్పీలు అశోక్ వర్ధన్, గోవిందరావు, డీఎస్పీలు బాలసుందర్‌రావు, రత్తయ్యలను నియమించారు. ప్రతి 15 రోజులకోసారి కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించిన ప్రభుత్వం.. సిట్‌కు పూర్తి స్థాయి అధికారాలు అప్పగించింది. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై కాకినాడలో 13 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
