లాక్కోవడం దాచుకోవడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య
ఆయనకు గుండ్లు కొట్టించడం అలవాటే కేశవరం కొండకు గుండు కొట్టించారు
మండపేట వ్యవసాయ మార్కెట్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారంలో మంత్రి సుభాష్
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట: ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు రామచంద్రపురంలో ఇప్పటికే మూడు రిటర్న్ గిఫ్ట్ లు ఇచ్చాం నాలుగోవది కేశవరం గ్రావెల్ కొండకు గుండు కొట్టిన దాంట్లో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. మండపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం పట్టణంలో సూర్య కన్వెన్షన్ హాల్లో ఆదివారం ఘనంగా జరిగింది. మండపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా చింతపల్లి రామకృష్ణ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు కేసులు పెట్టిన ఘనత వైసిపి నాయకులకి ఉందని అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మండపేట వైసిపి నేత చేసిన అన్యాయాలపై ఇప్పటికే మూడు బహుమతులు ఆయనకి అందించామని చురకలు అంటించారు. అదేవిధంగా ఆయనకు గుండ్లు కొట్టించడం అలవాటైన పనే అని ఆ అలవాటుతోనే కేశవరం కొండకు గుండు కొట్టించారని దీనిపై కూడా తగు చర్యలు ఉంటాయని ఆయన అన్నారు. గత వైసిపి ప్రభుత్వం బీసీలకు, ఎస్సీలకు తీరని అన్యాయం చేసిందని మంత్రి సుభాష్ అన్నారు. పేరుకి పదవులను అందించి ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించిన పాపాన పోలేదన్నారు. అంతేకాకుండా తెదేపా ఎప్పుడు బీసీలకు పెద్దపీట వేస్తుందని ఆయన అన్నారు. గత వైసిపి ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ లోన్లు అసలు ఇచ్చారా అని ప్రశ్నించారు.
బీసీ ఫండ్స్, సబ్ ప్లాన్ నిధులను మొత్తం వేరే వాటికి మళ్ళించారన్నారు. అంతే కాకుండా సుమారు 26 బిసి పథకాలను రద్దు చేసిన విషయాన్ని మంత్రి సుభాష్ గుర్తు చేశారు. అదేవిధంగా రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మాట్లాడుతూ టిడిపి అంటేనే బీసీలు అని, బీసీలు అంటేనే టిడిపి అని ఆయన అన్నారు. కూటమీ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తుందని ఆయన అన్నారు. రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ల లీలా కృష్ణ మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వంలో మండపేటలో బీసీలకు ఎలాంటి పదవులు ఇవ్వలేదని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం బీసీల పట్ల నిబద్ధతతో కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కూర్మాపురం అబ్బు, మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు వర ప్రకాష్, రాష్ట్ర శెట్టిబలిజ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు పాల్గొన్నారు.
కార్యక్రమానికి ముందుగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులతో మంత్రి సుభాష్ ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్ గా చింతపల్లి రామకృష్ణ ఎంపిక కాగా వైస్ చైర్మన్ గా మోటుపల్లి బాపిరాజు ఎంపికయ్యారు. కమిటీ డైరెక్టర్లు గా చెర్ల రామచంద్రారెడ్డి, చోడే పాపారావు, బొబ్బ సుకన్య, ఓబిలినేని మున్ని ప్రియాంక, బోనం సత్యవేణి, పిల్ల లోకపావని, మేడింటి సూర్య ప్రకాశరావు, రాయి వీర్రాజు, నామాల చంద్రకళ, ఆంధ్ర దేవి, మాసగిరి బుల్లెమ్మ, మట్టల మధుసూదన్ రావు, పెందుర్తి రామలక్ష్మిలు ఎంపికయ్యారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


