గిరిజన సంక్షేమ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు ,; కేతావత్ బాబు రామ్ నాయక్.
దేవరకొండ జూన్ 24 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గంలోని ప్రైవేట్ పాఠశాలల అక్రమ కార్యకలాపాలు వెలుగులోకి – గిరిజన విద్యార్థుల హక్కులు పక్కన పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ విద్యార్థుల భద్రతను, హక్కులను తక్కువ చేస్తూ పనిచేస్తున్నాయి. ఈ మేరకు గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు విద్యార్థుల రాజకీయ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు శ్రీ కేతావత్ బాబురామ్ నాయక్ గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన ప్రధాన అక్రమాలు ఇవే:
- డ్రస్సులు, పుస్తకాల బలవంతపు అమ్మకాలు:
పాఠశాలలు తల్లిదండ్రులకు తప్పనిసరిగా తమ వద్దే యూనిఫాంలు, షూస్, బ్యాగ్స్, బెల్ట్స్, నోటుబుక్స్, పాఠ్య పుస్తకాలు కొనాలని ఒత్తిడి తెస్తున్నాయి. ఇది విద్యా శాఖ నిబంధనలకు విరుద్ధమైన చర్య. - హాస్టల్ అనుమతుల లేకపోయినా నిర్వహణ:
తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు హాస్టల్ నిర్వహించేందుకు ఎలాంటి ప్రత్యేక అనుమతులు లేవు. అయినప్పటికీ అనేక ప్రైవేట్ పాఠశాలలు హాస్టల్స్ నడుపుతూ విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుతున్నాయి. - అనుమతి లేని బస్సుల నడుపుదల:
పాఠశాల బస్సులు, వాహనాలు సరైన పర్మిట్, ఫిట్‌నెస్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ లేకుండా నడిపిస్తున్నాయి. ఇది విద్యార్థుల రవాణా భద్రతకు ఘోరమైన ముప్పు. - విద్యా హక్కు చట్టం (RTE) 25% కోటా అమలులో విఫలం:
ప్రైవేట్ పాఠశాలలు నిర్దేశించిన 25% కోటా ప్రకారం పేద, వెనుకబడిన తరగతుల గిరిజన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించకుండా వారికి న్యాయం చేయడం లేదని స్పష్టమైంది.
దేవరకొండ (ఎస్టి) నియోజకవర్గం గిరిజన ప్రాధాన్యత గల ప్రాంతం. ఇక్కడ ఈ అక్రమాల ప్రభావం గిరిజన విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్రమైన దుష్ప్రభావం చూపుతోంది. ప్రత్యేకించి పేద గిరిజన కుటుంబాలకు చెందిన విద్యార్థులు విద్యా హక్కులను కోల్పోతున్నారు.
ఈ సందర్భంలో శ్రీ కేతావత్ బాబురాం తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు:
“దేవరకొండ (ఎస్టి) నియోజకవర్గం వంటి గిరిజన ప్రాంతాల్లో RTE 25% కోటా అమలు చేయకపోవడం వెనుక ఎవరి బాధ్యత?”
అందువల్ల ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని:
అక్రమంగా నిర్వహిస్తున్న హాస్టల్స్, బస్సులను నిలిపివేసి,
డ్రస్సులు, పుస్తకాల అమ్మకాలపై ఆంక్షలు విధించి,
RTE 25% కోటా అమలుపై తనిఖీలు చేసి,
నిబంధనలు పాటించని స్కూళ్ల అనుమతులు రద్దు చేయాలని బాబురామ్ నాయక్ డిమాండ్ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


