త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాయవరం మండలం మాచవరం, పేద, మధ్యతరగతి వర్గాలకు మరిన్ని వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, పేర్కొన్నారు. రాయవరం మండలం, మాచవరంలోని రెడ్డి పట్టాబి రామన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ర.భ.శాఖ, జాతీయ ఆరోగ్య పథకం, 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించే పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీ, బీహెచ్ఎంఐఎస్ భవన నిర్మాణానికి సోమవారం ఆయన భూమిపూజ చేసి, పనులు ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ల్యాబ్ నిర్మాణం పూర్తయితే మరిన్ని వైద్య సేవలు అందబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. రూ.80.96 లక్షలతో నిర్మించే భవనాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామశాఖ అధ్యక్షులు మేడపాటి రవీంద్రారెడ్డి. రిమ్మలపూడి బ్రహ్మారావు చౌదరి, సాగునీటి సంఘం ఉపాధ్యక్షుడు రిమ్మలపూడి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ రొంగల శ్రీనివాస్, కాదా ఏడుకొండలు, కొవ్వూరి ఆదిరెడ్డి, కోడి చిన అప్పారావు, డాక్టర్స్, సిబ్బంది, కూటమి నాయకులు, తదితర్లు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


