మండల విద్యాధికారి గోప్యా నాయక్.
డిండి (గుండ్ల పల్లి ) మే 19త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల శిక్షణ రాష్ట్రస్థాయిలో మరియు మండల స్థాయిలో శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నారు నల్గొండ జిల్లా డిండి మండల ఉపాధ్యాయులకు ఈనెల 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు చెరుకుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోశిక్షణ ఇవ్వబడుతుందని మండల విద్యాధికారి ఐ గోప్యా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా ఆన్లైన్లోనే జియో టాకింగ్ ఆధారిత హాజరును ఉపాధ్యాయుల నుంచి ఐదు రోజుల శిక్షణ అనంతరం ఆన్లైన్లోనే హాజర్ సర్టిఫికెట్ వస్తుంది అని తెలిపారు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఎఫ్ ఎల్ ఎన్ మాడుల్స్ తమ వెంట తీసుకొని రావాలని సూచించారు.
ఉదయం ఎఫ్ ఎల్ ఎన్ యాప్ లో అటెండెన్స్ చెక్ ఇన్ మరియు చెక్ అవుట్ చేయవలసి ఉంటుంది. మొదటి రోజు ప్రీ టెస్ట్ మరియు చివరి రోజు టెస్ట్ రాయవలసి ఉంటుంది అని తెలిపారు ఎవరైతే హాజరైతరో వారికి మాత్రమే సర్టిఫికెట్ వస్తుందని హాజరు కాని వారికి డిఇఓ షోకాస్ నోటీసు వస్తుందని తెలిపారు. ఉపాధ్యాయులందరూ సరైన సమయానికి హాజరుకావాలని, శిక్షణ శిబిరంలోని మధ్యాహ్నం భోజన వసతి కల్పించబడుతుందని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


