జూన్ 26, 2026
TRINETHRAM NEWS

ఘనంగా లోచలిపుట్టులో,మలకపోలంలో తొలి అడుగు కార్యక్రమం

త్రినేత్రం న్యూస్, ( పాడేరు ) ఇంటింటికి తొలి అడుగు కార్యక్రమంలో టీడీపీ నాయకులు.. సుపరిపాలన తొలి అడుగులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు బుధవారం లోచలిపుట్టు, మల్కాపొలం గ్రామాల్లో ఏపీ టూరిజం డైరెక్టర్ కిల్లు వెంకట రమేష్ నాయుడు అధ్యర్యంలో ఘనంగా తొలిఅడుగు కార్యక్రమం నిర్వహించడం జరిగింది.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు.

ఇందులో భాగంగా సూపర్ సిక్స్ పథకాల్లో ఇప్పటికే తల్లికి వందనం,దీపం పథకం,అన్నక్యాoటీన్లు,మెగా డిఎస్సి,ఎస్సి వర్గీకరణ,బీసీ సంక్షేమo, గుంటలులేని రోడ్లు,సబ్సిడీ విద్యుత్, సురక్షిత ఆంధ్రప్రదేశ్, మహిళ సంక్షేమం, పోలవరం నిర్మాణం, రాజధాని ఏర్పాటు వంటి ఏన్నో విజయాలు సాదించమన్నారు.ఈ కార్యక్రమంలో మాజీమంత్రి మత్యరాస మణికుమారి, మాజీ చైర్మన్ వంజంగి కాంతమ్మ,తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వహన కార్యదర్శి, కోడా వెంకట సురేష్ కుమార్ ,ఎంపీటీసీ వర్తన లింగమ్మ, సీనియర్ నాయకుడు శోభ శ్రీను,యువనాయకులు వనుగు సురేంద్ర,తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

First step in good governance

You cannot copy content of this page