MLC Thota Trimurthulu : బాణాసంచా దుర్ఘటన దురదృష్టకరం

TRINETHRAM NEWS

మృతులకు 50 లక్షలు చెల్లించాలి…
పునరావృత్తం కాకుండా చర్యలు చేపట్టాలి…

ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు

త్రినేత్రం న్యూస్, మండపేట ; సామర్లకోట మండలం వేట్లపాలెం లో చోటుచేసుకున్న బాణాసంచా దుర్ఘటన దురదృష్టకరమని రాష్ట్ర సబ్ ఆర్డినేటరి కమిటీ చైర్మన్, మండపేట నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. మండపేట వైసీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాధితులను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వం రూ 50 లక్షలు ఎక్స్గ్రేషియో చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. 18 మంది మృతి తో పాటు చాలామంది కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. వీరికి మెరుగైన వైద్య సాయం అందించాలని ఆయన కోరారు.

ఈ ఘటన దారుణమైన సంఘటనని పేర్కొన్నారు. ఇదే రీతిలో ఇటీవల రాయవరం మండలం కొమరపాలెంలో ఇటువంటి సంఘటన జరిగిందన్నారు. ఆ ఘటన లో పదిమంది వరకు మృతి చెందారన్నారు. తిరిగి అదే తరహా ప్రమాదం చోటుచేసుకుందని దీనిపై ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం బాణాసంచా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారా లేదా అని తెలుసుకునే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. గతంలో కొమరిపాలెం ఘటనపై అమరావతి నుంచి రాష్ట్ర స్థాయి ప్రభుత్వ కార్యదర్శి స్థాయి కమిటీ వచ్చి విచారణ చేసి వెళ్లారన్నారు.

అనంతరం తీసుకున్న చర్యలు ఏమిటో చెప్పలేదన్నారు. కమిటీ ఇచ్చిన నివేదిక ఏమిటని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఎటువంటి ఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని నిలదీశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం అసమర్ధత అని పేర్కొన్నారు. రాయవరం ఘటన అనంతరం ఎటువంటి చర్యలు తీసుకున్నారని నిలదీశారు. ఈ ఘటనపై ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇది అధికారుల, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చూపిస్తుందని దుయ్యబట్టారు. బాణసంచా కర్మాగారాలు లో ఎటువంటి నిబంధనలు పాటించాలని ఆదేశాలు ఇచ్చారో తెలపాలని పేర్కొన్నారు.

రాయవరం మండలం కొమరిపాలెం సంఘటన అనంతరం అమరావతి నుంచి వచ్చిన కమిటీ ముందు తాము వాదనలు వినిపించామని చెప్పారు. అయితే కమిటీ భవిష్యత్తులో ఎటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారని చెప్పారు. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారా లేదా ఇస్తే వాటి మీద తీసుకున్న చర్యలు ఏమిటని ప్రశ్నించారు. మరో సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీశారు. పోలవరం అమరావతి పైనే దృష్టి పెడుతున్నారని దీనిపై ఉన్న శ్రద్ధ పరిపాలన పై పెట్టాలని సూచించారు.

పరిపాలనను గాలికి వదిలేసారని విమర్శలు చేశారు. శ్రీకాకుళం లో ఆహార కల్తీ తో ప్రజలు చనిపోయారన్నారు. కల్తీ పాలు తాగి రాజమహేంద్రవరంలో పలువురు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు డైరీ పాలు తాగాలంటే భయంగా ఉందని పేర్కొన్నారు. ఇపుడు బాణాసంచా దుర్ఘటన లో మృతుల కుటుంబాలకు రూ 50 లక్షలు తక్కువ కాకుండా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మృతుల పిల్లలకు చదువుకొని ఉంటే విద్యార్హతలు అనుసరించి వారికి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో వైసిపి హయాంలో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు కోటి రూపాయలు ఒక్క కుటుంబానికి అందజేశారని గుర్తు చేశారు.

ఈ సమావేశంలో అడబాల బాబ్జి, పిల్లి శ్రీను, సిరిపురం శ్రీను, వైసిపి నాయకులు పలివెల సుధాకర్,పిల్లా వీరబాబు, వనం నారాయణ,యారమాటీ వెంకన్న బాబు, త్రిశూలం శ్రీను, సాధనాల శివ, సీతిన రామకృష్ణ,తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Fireworks accident is unfortunate

You cannot copy content of this page

Scroll to Top