Khamenei Dead : ఇరాన్ చీఫ్ ఖమేనీ చనిపోయారు: ట్రంప్

TRINETHRAM NEWS

Trinethram News : ఇరాన్ సుప్రీంలీ డర్ అలీ ఖమేనీ చనిపోయినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఖమేనీని చరిత్రలోనే అత్యంత చెడ్డ వ్యక్తిగా పేర్కొన్నారు. ఈ చావుతో ఇరాన్ పౌరులతో పాటు అమెరికన్లు, బాధిత దేశాలకు న్యాయం జరిగిందన్నారు. తమ నిఘా నుంచి ఖమేనీ తప్పించుకోలేకపోయారని అన్నారు. ఇరాన్ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అక్కడి పౌరులకు ఇది అతిపెద్ద అవకాశమన్న ట్రంప్.. దాడులు మరో వారం కొనసాగుతాయన్నారు.

శాంతి కలుగుగాక’.. ఖమేనీ X అకౌంట్ నుంచి పోస్ట్!

ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ చనిపోయినట్లు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన X అకౌంట్స్లో ఒకదానిలో పోస్ట్ చర్చనీయాంశమైంది. ‘అతనికి శాంతి కలుగుగాక’ అని అర్థం వచ్చే పర్షియన్ టెక్స్ట్ పాటు ఓ యోధుడు ఖడ్గం పట్టిన ఇమేజ్ పోస్ట్ చేశారు. దీంతో ఇది ఖమేనీ మరణ వార్తను ఉద్దేశించి చేసిందేనని.. పరోక్షంగా కన్ఫామ్ చేసినట్టేనేనంటూ వార్తలు జోరందుకున్నాయి. అయితే ఇరాన్ ఇంకా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఖమేనీ డెత్ రిపోర్ట్స్.. ఇరాన్లో సంబరాలు

ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ చనిపోయారంటూ రిపోర్ట్స్ వచ్చిన నేపథ్యంలో ఆ దేశ పౌరులు సంబరాలు జరుపుకున్నారు. యుద్ధ వాతావరణాన్ని లెక్కచేయకుండా రోడ్లపైకి వచ్చి డాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. గతంలో పలు మార్లు ప్రభుత్వంపై ఇరాన్లో నిరసనలు చెలరేగడం వాటిని ఖమేనీ ప్రభుత్వం అణచివేయడం జరిగిన సంగతి తెలిసిందే. కాగా పరిస్థితులు చక్కబడే వరకు ఇరాన్పై దాడులు కొనసాగుతాయని US అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Iran's Supreme Leader Khamenei Dead

You cannot copy content of this page

Scroll to Top