YCP to TDP : 26వ వార్డుకు చెందిన పలువురు టీడీపీ లో చేరిక

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, మండపేట పట్టణం 26వ వార్డు నుండి వైసీపీ కి చెందిన పలువురు కార్యకర్తలు ఆ వార్డు టీడీపీ అధ్యక్షులు పంతం వెంకటరమణ ఆధ్వర్యంలో ఆదివారం మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో రాష్ట అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశరరావు సమక్షంలో తెలుగుదేశంపార్టీలో చేరారు.

పార్టీలో చేరిన వారిలో పోటూరి సత్యనారాయణ, మావూరి శ్రీనివాస్, బండారు జయమ్మ, వాతా అనంతలక్ష్మి, పేకేటి మాణిక్యం, పొన్నాడ అప్పలనర్స, పట్టా హైమావతి, చింతా శ్రీను, దాసరి కోటయ్య, దాసరి తలుపులమ్మ, దాసరి లోవ, గంధం మంగమ్మ, వాసంశెట్టి పరంజ్యోతి, వాసంశెట్టి జ్యోతిపాల్, విత్తనాల రామకృష్ణ, కట్టా సాయి, కాకి సీతారాములు, చిమ్మన కళ్యాణి, గన్నిరెడ్డి శ్రీను లు ఉన్నారు. వీరందరికీ ఎమ్మెల్యే వేగుళ్ళ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.

ఈ సంధర్బంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీ లో చేరటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు మత్స నాగు, మాజీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, గడి రాంబాబు, అమలాపురం పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి దేవు శ్రీను, నామాల వెంకటరమణ, పేరూరి రామకృష్ణ, గోరు ప్రభాకరరావు, బత్తుల భవాని, వంక మణి, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Many from Ward 26 joined TDP

You cannot copy content of this page

Scroll to Top