జూలై 16, 2026
TRINETHRAM NEWS
Adivasi Tribal Association

Adivasi Tribal Association : అరకులోయ జూన్ 18, (త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా స్థాయి శిక్షణ తరగతులు అరకువేలి గిరిజన సంఘం కార్యాలయంలో 17,18,19 తేదీల్లో మూడురోజులు పాటు జరుగుతుందని ఆదివాసీ హక్కులు చట్టాలు, సంస్కృతి సంప్రదాయాలు, ఆదివాసీ కళలు, అడవి భూమి, నీరు రక్షణకోసం పోరాటం కొనసాగిస్తామని జిల్లా శిక్షణ శిబిరం ప్రారంభం సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరి సీతారామరాజు జిల్లా కమిటీ పిలుపునిచ్చింది
ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్ ధర్మన్న పడాల్ అధ్యక్షతన జరిగిన ప్రారంభ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలాదేవ్ మాట్లాడుతూ ఆదివాసి షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసి హక్కులు చట్టాలు ఉల్లంఘిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసి సహజ వనరులు ,సంపదలు అడవి ,భూమి , నీరు కార్పొరేట్ బడా కంపెనీలకు అప్పనంగా అప్పగిస్తున్నాయని ఆదివాసి సంస్కృతి సాంప్రదాయాలు పండుగలు కళలు నిర్వీర్యం చేసే విధంగా ఆదివాసుల తెగల మధ్య వైమానిష్యాలు విభేదాలు సృష్టిస్తున్నారని ప్రకృతిని దైవంగా ఆరాధించే ఆదివాసులకు మతం పేరుతో విడదీస్తున్నారని ఆదివాసులకు వంద శాతం రిజర్వేషన్ చట్టం చేయాలని ఆదివాసి స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అక్రమ ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 13 ,51, 2 రద్దు చేయాలని పీఎం జన్మన్ హౌసింగ్ బకాయి బిల్లులు ఇవ్వాలని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పెంచిన లక్ష రూపాయలు విడుదల చేయాలని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కొనసాగించాలని ముఖ హాజరు రద్దు చేయాలని డిమాండ్ చేశారు,
ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం జిల్లా నాయకులు పి సత్యనారాయణ పి సురేష్ కుమార్ జి చిన్నబాబు గంగాధరం జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఆదివాసి గిరిజన సంఘం మండల పంచాయతీ గ్రామ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page