రైతుల సమస్యలపై 10 న పిఠాపురం లో అందోళన
పవన్ బాబు మా పంట వద్దకు రండి? రైతుల ఆవేదన
త్రినేత్రం న్యూస్, పిఠాపురం, డిసెంబర్ 03: పిఠాపురం నియోజకవర్గo లో ఏ రైతును కలిసిన మొంత తుపాన్ సాయం అందలేదని, పండించిన పంట కు గిట్టుబాటు ధర లేదని రైతులు, కౌలు రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తాటిపాక మధు అవేదన వ్యక్తం చేశారు రైతుల సమస్యలు పై సీపీఐ, ఏపీ రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ నెల 10 న పిఠాపురం లో ఆందోళన చేస్తామని మధు తెలిపారు.. బుధవారం ఉదయం నుండి పిఠాపురం మండలం లో సీపీఐ , రైతు సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో పంట పొలాలను పరిశీలించారు
ఈ సందర్భంగా తాటిపాక మధు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో 50 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేస్తామని,అందుకు గాను 6 కొట్ల70లక్షల గోనె సంచులు అందుబాటులో ఉంచుతామని చెప్పి ఆచరణలో రాష్ట్రప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తుందని ఆయన అన్నారు. కనీసం గోనె సంచులను రైతాంగానికి అందించడంలో విఫలమైందని తేమ శాతం పేరుతోనూ,ధాన్యం రంగు మారిందని, తాలు, తప్పలు ఉన్నాయని ధాన్యం కొనుగోలు చేయకుండా అనేక కొర్రీలు పెడుతున్నారని తుఫాను ప్రభావంతో పంటలు దెబ్బతింటాయని తీవ్ర ఆందోళన చెందుతున్నారని, కనీసం పంటను ఆరబెట్టుకోవడానికి, తడవకుండా కాపాడుకోవడానికి పట్టాలు కూడా ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. కొనుగోలు నిబంధనలు సడలించి ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయాలని మధు కోరారు పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ పేపర్లకే పరిమితమయ్యారని ఆచరణలో శూన్యమన్నారు.
కొనుగోలు కేంద్రం, రైతు సేవ కేంద్రం, రవాణా ఇన్ చార్జిలు,కస్టోడియన్ ఆఫీసర్లు రైస్ మిల్లర్స్ కుమ్మక్కైధాన్యం దళారులకు అమ్ముకునే విధంగా వ్యవహరిస్తున్నరన్నారు.క్షేత్ర స్థాయిలో ధాన్య రైతులు ఇబ్బంది పడుతుంటే నాదెండ్ల పర్యటనలకే పరిమితమౌతున్నారని పేర్కొన్నారు.దీంతో 75 కేజీల బస్తాన్ని రూ.1200 అమ్ముకొని బస్తాకు రూ.400 నుంచి 500 వరకు నష్టపోతున్నారని కొనుగోలులో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని,దోపిడీని నివారించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా మొంథా తుఫాను వలన రూ.5500 కోట్లు పైగా నష్టం జరిగితే ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు రూ.1000 కోట్ల మేర రైతులకు నష్టం జరిగిందన్నారు.
ఎన్యూమరేషన్ పూర్తి చేసి నెల రోజులైన రైతాంగానికి నష్ట పరిహారం అందించకపోవడం రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు.కూటమి సర్కారు ఆధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న ఉచిత పంటల బీమా పథకం ఎత్తివేసి స్వచ్ఛంద పంటల భీమా పథకాన్ని ప్రవేశపెట్టడంతో భీమా ప్రీమియం భారంగా ఉండటం వలన ఎక్కువ మంది రైతులు బీమా పథకంలో చేరలేక పోయారన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వల్ల పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు బీమా పరిహారం దక్కే అవకాశం లేకుండా పోయిందని దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రబీ నుండైనా ఉచిత పంటల బీమా పథకం అమలు అమలు చేయాలని కోరారు. గత రెండు 18 నెలలగా రాష్ట్ర ప్రభుత్వం రైతులను నమ్మించి మోసం చేసిందన్నారు. ఇంటికి వెళ్లి రైతును రాజును చేస్తామని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని,రైతులను రాజును చేయటం ఏమోగానీ రైతులను భికారిని చేయొద్దన్నారు. రైతుల అభివృద్ధికి పంచసూత్రాలను ప్రచారం చేస్తుందని, కూటమి సర్కారు ఆధికారంలోకి వచ్చిన తరువాత పంచ పాపాలు చేసి రైతాంగని దగా చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసాలను నిలదీయడానికి ,ఖరీఫ్ సీజన్ లో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 10 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులు ,రైతాంగానికి పిలుపునిచ్చరు.
కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలని మొంథా తుపాను, ఆధిక వర్షాలు,వరదలు మరియు కరువు వలన పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు,కౌలురైతులకు వెంటనే ఇన్ పుట్ సబ్సిడీని చెల్లించాలిని మధు కోరారు
ఈ పర్యటనలో సీపీఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, పిఠాపురం కార్యదర్శి సాక రామకృష్ణ , ఏపీ రైతు సంఘం జిల్లా కన్వీనర్ నక్క శ్రీనివాస రావు, కె గోవింద్, రైతులు దొరబాబు, టీ ఏసుబాబు, గోవింద్ రాజాల నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


