Qasim Razvi : ప్రాంతీయ ఉన్మాదులను – ఖాసీం రజ్వి వారసులను భహిష్కరిద్దాం

TRINETHRAM NEWS

అభివృద్ధిని సాధిద్దాం ..

మేడా శ్రీనివాస్ , సూచనలు, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ..

కేసీఆర్ నాటిన విష వృక్షాలు తెలంగాణా ఆస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి ..

త్రినేత్రం న్యూస్, డిసెంబర్ 3: ఆంధ్రప్రదేశ్ లో కోనసీమ వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన తప్పుడు వ్యాఖ్యాలకు ఆంధ్రుల తరుపున భహిరంగ క్షమాపణ కోరుతున్నాము . రవీంద్ర భారతి ప్రాగణంలో సినీ నటుడు శుభలేఖ సుధాకర్ ను ఒక మీడియా ప్రతినిధిని అంటు మా తెలంగాణాలో ఏమి చేయాలో , మాట్లాడాలో మీ దగ్గర తెలుసుకోవాలా ! అంటు బాధ్యతను మరిచి మాట్లాడిన అతన్ని తెలంగాణా వాదులు మందలించాలి.

ఇప్పటికే కేసీఆర్ ను ఆదర్శంగా చేసుకుని కొంతమంది ప్రాంతీయ ఉన్మాదాన్ని ప్రోత్సహిస్తున్న ఘటనలు బావితరాలను మంచి పరిణామాలు కావు అని తెలంగాణా మేధావులు గ్రహించాలి . కొంతమంది బ్రతకటం కోసం ప్రాంతీయ ఉన్మాద చర్యలను ఉపాధిగా మార్చుకుంటున్నారు . ఇప్పటికే కొంత రాజకీయ ఐఖ్యత లోపించిన కారణంగా మోదీ సర్కార్ రాజకీయ అవసరాలకు తెలుగు రాష్ట్రాలపై కాలకుట విషం కక్కుతుంది .

ఇప్పటికే ఖాసీం రజ్వి వారసులు రాజకీయ పార్టి ముసుగులో హైదరాబాద్ కేంద్రంగా తిష్ట వేసుకుని ఒక ప్రక్క పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ప్రోత్సహస్తు మోదీ సర్కార్ కు బాంచన్ గా బ్రతుకుతున్నారు . తాలిబాన్ వారసులను మరిపిస్తున్నారు .

తెలంగాణా – ఆంధ్రప్రదేశ్ మేధావులు , విద్యార్థులు, యువత తెలుగు రాష్ట్రాల ఐఖ్యతకు ఒక బలమైన కార్యాచరణకు సిద్దపడాలి . లేకుంటే రెండు తెలుగు రాష్ట్రాలు నష్ట పోవటం ఖాయం అని గుర్తించాలి . పవన్ కళ్యాణ్ తప్పుడు మాటల పైన , రవీంద్ర భారతి ప్రాగణం లో మీడియా ప్రతినిధి ఉన్మాద మాటలపైన రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు చిత్త శుద్ధి ఉండాలి .లేకుంటే మరో ప్రమాధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందేమో నని తెలుగు ప్రజలు భయపడుతున్నారు .

తెలంగాణా – ఆంధ్రప్రదేశ్ పౌరులు ఉమ్మడి కార్యాచారణ ద్వారా భవిష్యత్ అవసరాలకు మార్గం చేసుకోక పొతే అభివృద్ధితో పాటుగా శాంతి భద్రతల సమస్యలతో నష్ట పోయే ప్రమాదం వుందని బావించాలి . రెండు తెలుగు రాష్ట్రాల మేధావులు, యువత, అభివృద్ధిపై దృష్టి సారించాలి . కేసీఆర్ , పవన్ కళ్యాణ్ వారసులను భహిష్కరించాలి . రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉంటే కేంద్రంలో బలంగా ఉంటామని గ్రహించాలి .

రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి , ఐఖ్యతకు ముందుగా ఉస్మానియా – ఆంధ్ర యూనివర్సిటీల విద్యార్థులు నడుం బిగించాలి . ఆ ప్రయత్నానికి మేము సైతం అని తెలియచేసుకుంటున్నాము.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Let's boycott the regional fanatics

You cannot copy content of this page

Scroll to Top