రైతుల ధాన్యాన్ని తరుగు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలి

TRINETHRAM NEWS

రైతు సంఘం జిల్లాఅధ్యక్షులు ఎం డి మైనో ద్ధిన్ .
డిండి (గుండ్ల పల్లి) మే 20 త్రినేత్రం న్యూస్. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ని రైతుల ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా మిల్లర్లు అన్లోడ్ చేసుకోవాలని రైతు సంఘం అధ్యక్షులు ఎం డి మైనోద్దిన్ అన్నారు. రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాతనే కొనుగోలు కేంద్రాల్లో అధికారులు మ్యచెర్ చూసి లోడ్ చేస్తున్నట్లు,మిల్లర్లు మాత్రం తరుగు పేరుతో 5 నుండి 6కిలోల. తరుగు తీస్తున్నారని అలాగైతేనే లారీ అన్లోడ్ చేస్తున్నారని, ఇలాంటి చర్యలు సమంజసం కాదని వెంటనే సంబంధిత అధికారులు మిలర్లపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.
రైతుల ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేయాలని , లారీల కొరతతో ఒక్కో రైతు నెలరోజులుగా కొనుగోలు కేంద్రాల్లో. పడి గాపులుకాసి ధాన్యం లోడ్ చేస్తే మిల్లర్లు తరుగు పేరుతో కోత విధించటం సరి కాదన్నారు. జిల్లా కలెక్టర్ ఇటీవలే మిల్లర్లతో మాట్లాడినా రైతుల పట్ల మిల్లర్లలో మార్పు రాకపోవడం దారుణమన్నారు.
ఇప్పటికైనా సంబంధిత ప్రభుత్వ అధికారులు స్పందించి సదరు మిల్లర్లపై తగుచర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా అధికారులను కోరారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Farmers' grain should be

You cannot copy content of this page

Scroll to Top