వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : తాండూరు మండలానికి సంబంధించిన SGT ఉపాధ్యాయులకు వృత్తి నైపుణ్యాలను పెంపొందించే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన 5 రోజుల శిక్షణ తరగతుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ శిక్షణ సమయంలో నేర్చుకున్న అన్ని అంశాలను విద్యార్థులకు తరగతి గదుల్లో బోధించాలి.
ప్రభుత్వ పాఠశాలపై ప్రజలకు పూర్తి నమ్మకం ఏర్పడే విధంగా పని చేయాలి. మారుతున్న టెక్నాలజీలని దృష్టిలో ఉంచుకొని అధునాతన పద్ధతుల ద్వారా విద్యార్థులకు నైపుణ్యం పెంచే విధంగా ఉపాద్యాయులు బోధించాలి.
ఈ సంవత్సరం పదవ తరగతి ఫలితాలపై ఆరా తీసి ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా కృషి చేసిన ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేసిన ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి వెంకటయ్య, ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


