జూలై 14, 2026
TRINETHRAM NEWS
Congress Goal

దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ .

Congress Goal : కొండ మల్లేపల్లి జులై 08, త్రినేత్రం న్యూస్. రైతు భరోసా నిధుల విడుదలను స్వాగతిస్తూ కొండమల్లేపల్లి చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ల “చిత్రపటాలకు దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్ పాలాభిషేకం” చేశారు.

తెలంగాణ రైతాంగం ఆర్థికంగా బలోపేతం కావాలన్న సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుని ముందుకు సాగుతోందని, ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ ప్రజా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపిస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత కూడా పాల్గొని రైతు భరోసా నిధుల విడుదలను స్వాగతించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని రైతు భరోసా నిధుల విడుదల పట్ల హర్షం వ్యక్తం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page