నకిలీ నోట్లతో పండ్ల వ్యాపారికి టోకరా.
దేవరకొండ డివిజన్ డిసెంబర్ 30 త్రినేత్రం న్యూస్. దేవరకొండ లో నకిలీ నోట్లు కలకలం రేపాయి. పట్టణానికి చెందిన పండ్ల వ్యాపారి జహీర్ వద్ద ఓ మహిళ రూ; 1500 విలువైన పండ్లు కొనుగోలు చేసి మూడు ఐదు వందల రూపాయల నోట్లు ఇచ్చి వెళ్ళింది.
వ్యాపారం ముగిశాక నగదును పరిశీలించగా అవి నకిలీ నోట్లు అని తేలింది . దీంతో తాను మోసపోయాయని వ్యాపారి వాపోయారు. నూతన సంవత్సరం సందర్భంగా రద్దీని ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడే అవకాశం వుందని, తోటి వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలనికోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


