CM to Arrive in Devarakonda : దేవరకొండకు 6 న సీఎం రాక

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ డిసెంబర్ 05 త్రినేత్రం న్యూస్. దేవరకొండలో జరగనున్న ప్రజాపాలన–ప్రజా విజయోత్సవాల బహిరంగ సభ ప్రాంగణం, హెలిప్యాడ్ స్థల నిర్మాణం మరియు ఇతర ఏర్పాట్లను దేవరకద్ర ఎమ్మెల్యే గవినోళ్ల మధుసూదన్ రెడ్డి ,అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీ కృష్ణ తో కలిసి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పర్యవేక్షించారు.

ప్రజలు భారీగా హాజరయ్యే దృష్ట్యా కుర్చీలు, త్రాగునీరు వంటి అవసరమైన సదుపాయాలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు.సభ డయాస్‌ సహా అన్ని తాత్కాలిక నిర్మాణాలపై పలు మార్గదర్శకాలుఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవరకొండ పర్యటన విజయవంతం కావడానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు.
ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపనలు చేస్తారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ ముఖ్య నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు,ఎన్ ఎస్ యు ఐ నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CM to arrive in Devarakonda on 6th

You cannot copy content of this page

Scroll to Top