గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈ రోజు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణ పోలీసుల నేతృత్వంలో నగరంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పారిశ్రామిక నగరంలో రద్దీగా ఉండే ప్రాంతాలలో పోలీసులు బాంబు స్క్వాడ్, జాగిలాలతో తనిఖీలు చేపట్టారు జనసంచారం ఎక్కువగా ఉండే ఏరియాలలో పోలీసులు అడుగడుగునా సోదలు జరిపారు. పట్టణంలోని గోదావరిఖని బస్టాండ్, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, అదేవిధంగా ప్రధాన చౌరస్తా, లక్ష్మీ నగర్ బజార్, ఓల్డ్ అశోక్ థియేటర్ ఏరియా తోపాటు నగరంలోని వివిధ ప్రాంతాలలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.
ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా సోదా చేశారు. అదేవిధంగా నిత్యం రద్దీగా ఉండే దుకాణ సముదాయాల ప్రాంతాల్లో నిలిచి ఉన్న వాహనాలను బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. బస్టాండ్ ప్రాంతాన్ని బాంబు స్క్యాడ్ సిబ్బంది తనిఖీలు జరిపింది. అనుమానం వచ్చిన వస్తువులనుబ్యాగ్ లను జాగిలాలతో సోదాలు చేశారు. తనిఖీ లలో ఎస్ ఐ రమేష్, భూమేష్, అనూష తో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


