ముఖ్యఅతిథిగా హాజరైన రామగుండం ఎంఈఓ జింక మల్లేశం పారుపల్లి రాజలింగం
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఉర్దూ మీడియం పాఠశాల ప్రధానోపాధ్యాయులు నికత్ ఫాతిమా అధ్యక్షతన యం.పి.పి.యస్ గంగానగర్ ఉర్దూ మీడియం, గోదావరి ఖని పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నిఖిత్ ఫాతిమా అద్యక్షతన ఘనంగా ప్రపంచ ఉర్దూ దినోత్సవం మరియు జాతియ విద్యా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖాధికారి జింకా మల్లేశం ప్రతి ఆహ్వానితులుగా సీనియర్ పాత్రికేయులు పారుపల్లి రాజలింగం హాజరయ్యారు, పూర్వ ప్రాథమిక పాఠశాలను, పరేడ్ బ్యాండ్ లను ప్రారంభించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని, మహ్మద్ ఇక్బాల్ జయంతి సందర్భంగా ప్రపంచ ఉర్దూ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని వివరించారు. వారు విద్యా వ్యాప్తికి, ఉర్దూ భాషాభివృద్ధికి చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తు లో గొప్ప స్థాయికి చేరుకొని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. విద్యా ప్రాముఖ్యత పైన విద్యార్థులు నిర్వహించిన ప్రసంగాలు, పాటలు, నాటికలు, నినాదాలు అందరినీ అలరించాయి.
అనంతరం సీనియర్ పాత్రికేయులు పి.రాజలింగం సార్ ని సన్మానించిన అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి ఉపాధ్యాయులు చేస్తున్న సేవలు అమోఘం అని కొనియాడారు ముఖ్యంగా ప్రైమరీ సెక్షన్ లో ఉండే పిల్లలకి క్రమశిక్షణతో పాటు పాఠశాలకు వెళ్లాలని ఆలోచన కల్పించడం ఆ ఘనత ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నికిత్ ఫాతిమా మాకే దక్కిందని కొనియాడారు అలాగే జాతీయ విద్యా విధానం లో ప్రభుత్వం చేస్తున్న మార్పులు చేర్పులను తెలుసుకోవడం కోసం నికత్ ఫాతిమా భువనేశ్వరి వెళ్లి శిక్షణ పొంది రావడం మీకు అందరు అదృష్టమని అన్నారు అక్కడ శిక్షణ పొందిన విషయాలను మీకు నేర్పిస్తూ మీలో జాతీయ విద్యా విధానం పద్ధతులపై మీలో కనిపించడం ఎంతో ఆవశ్యకతను సంతరించుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యస్.ఎం.సి చైర్మన్ సద్దాం హుస్సేన్ ఎఎపిసీ చైర్మన్ పరిపూర్ణ, నీళిమ మేడం, స్కౌట్స్, ఆర్ట్స్ & క్రాఫ్ట్ టీచర్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


