Ramavat Ravindra Kumar : ప్రతి ఒక్కరు అంకాలమ్మ తల్లి అనుగ్రహం పొందాలి

TRINETHRAM NEWS

బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,మాజీ దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్.
దేవరకొండ (చందంపేట) ఆగష్టు 13 త్రినేత్రం న్యూస్. ప్రతి ఒక్కరు అంకాలమ్మ తల్లి అనుగ్రహం పొందాలి అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,మాజీ దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం చందంపేట మండలంలోని చిత్రియాల గ్రామంలో అంకాలమ్మ తల్లి జాతర సందర్భంగా అంకాలమ్మతల్లిని దర్శించుకొని మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని ఆయన అన్నారు.ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలమర్చుకోవాలని అని ఆయన అన్నారు.

అంకాలమ్మ తల్లి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండి సకాలంలో వర్షాలు కురిసి ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బోయపల్లి శ్రీనివాస్ గౌడ్, బిఆర్ఎస్ మండల కార్యదర్శి కేతావత్ శంకర్ నాయక్,రమావత్ మోహన్ కృష్ణ,బోయపల్లి రాములు గౌడ్, పోలగొని సత్యనారాయణ గౌడ్,వడ్త్యా బాలు, గుండెబోయిన పవన్, సిగిలంపట్ల వెంకటయ్య,లింగం,ప్రశాంత్, శంకర్ గౌడ్,తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

blessings of Ankalamma Mother

You cannot copy content of this page

Scroll to Top