Traffic Rules : ట్రాఫిక్ నిబంధనలను అందరూ పాటించాలి

TRINETHRAM NEWS

డీ ఎస్ పి ఎం వి శ్రీనివాస రావు.

డిండి (గుండ్ల పల్లి) జనవరి 10 త్రినేత్రం న్యూస్. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని దేవరకొండడిఎస్పి ఎంవి శ్రీనివాసరావు అన్నారు. శనివారం రోజు నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రంలో ఎస్సై బాలకృష్ణ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా డి ఎస్ పి ఎం వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు రోడ్డు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కృషి చేయాలని మరియు ప్రతి ఒక్కరు హెల్మెంట్ ధరించాలని లేకపోతే పెట్రోల్ బంకులలో పెట్రోల్ లభించదని ప్రతి వాహనా దారుడు హెల్మెట్ విధిగా ధరించాలని కోరారు ఈ కార్యక్రమంలో డి ఎస్ పి శ్రీనివాసరావు ఎస్సై సిహెచ్ బాలకృష్ణ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ డిండి మండల అధ్యక్షుడు దొంతినేని వెంకటేశ్వరరావు డిండి (గుండ్ల పల్లి )సర్పంచ్ నల్లగంతుల రవి మాజీ సర్పంచ్ శైలేష్ చెరుకుపల్లి సర్పంచ్ మీసాల రామచంద్రయ్య బురాన్ పూర్ సర్పంచ్ వెంకట్రాం గ్రామ యువకులు మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Everyone should follow traffic rules

You cannot copy content of this page

Scroll to Top