Division Level Kabaddi Competitions : డివిజన్ స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ జనవరి 10 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో దేవరకొండ “డివిజన్ స్థాయి కబడ్డీ పోటీలను” ప్రజా ప్రతినిధులు, కబడ్డీ నిర్వాహకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి కబడ్డీ పోటీలను దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ప్రారంభించారు.
అత్యంత ప్రతిష్టాత్మకంగా కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. మట్టి వాసనతో కూడిన అద్భుతమైన క్రీడా కబడ్డీ అన్నారు. కబడ్డీ కేవలం ఆట మాత్రమే కాదు అది మన దేశ సంస్కృతిలో ఒక భాగం అని ,కబడ్డీ ఆటను చూసేవారికి కూడా ఉత్సాహం వస్తుందని తెలిపారు.

కబడ్డీ ఆడడానికి కేవలం శారీరక బలం మాత్రమే కాకుండా ప్రత్యర్థి నుంచి వేగంగా ఎలా తప్పించుకోవాలో కూడా అవసరం అని అభిప్రాయపడ్డారు. అనంతరం అండర్ 14 కబడ్డీలో జాతీయ క్రీడాపోటిల్లో సెలెక్ట్ అయిన ఉదేపన యాదవ్ కి శాలువాతో సత్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు , ప్రజలు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Division level kabaddi competitions begin

You cannot copy content of this page

Scroll to Top