MLA KP. Vivekanand : అభ్యర్థి ఎవరైనా కుత్బుల్లాపూర్ లో మళ్లీ గులాబీ జెండా ఎగరేలా ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలి

TRINETHRAM NEWS

పార్టీ అన్నిటికంటే గొప్పదని, క్యాడర్ ముఖ్యమని, కొందరు నాయకులు పార్టీని వీడినంత మాత్రానా పార్టీకి నష్టం లేదు…

Trinethram News : ఈరోజు చింతల్ లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ డివిజన్ అధ్యక్షులు దేవరకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన డివిజన్ స్థాయి బిఆర్ఎస్ పార్టీ సమన్వయ సమావేశానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో పార్టీ గెలుపుకై చేపట్టవలసిన చర్యలపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….

పార్టీ అన్నిటికంటే గొప్పదని, క్యాడర్ ముఖ్యమని, కొందరు నాయకులు పార్టీని వీడినంత మాత్రానా పార్టీకి నష్టం లేదని….నాయకునితో సంబంధం లేకుండా పార్టీ ప్రకటించిన అభ్యర్థి గెలుపుకై ప్రతి నాయకుడు, కార్యకర్త పనిచేయడం వల్లనే గత 12 ఏళ్ల కాలంలో కుత్బుల్లాపూర్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను, అన్ని వర్గాల ప్రజలను సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధి చేశామని అన్నారు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లాయని, మూడుసార్లు ప్రజలు వారిని ఛీ కొట్టినా బుద్ధి రాలేదన్నారు.

కాంగ్రెస్ పార్టీలో నాయకులు, కార్యకర్తలు లేరని మన పార్టీకి చెందిన నాయకులను ప్రలోభాలకు గురి చేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం హేయమైన చర్య అని అన్నారు.

గత 12 ఏళ్ల కాలంలో నియోజకవర్గంలోని అన్ని డివిజన్లతో పాటు కుత్బుల్లాపూర్ డివిజన్లోని అన్ని కాలనీలలో మౌలిక వసతులను కల్పిస్తూ అభివృద్ధి చేశామని, రానున్న రోజుల్లో కూడా డివిజన్లోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని, చేసిన అభివృద్ధిని ప్రజలకు గుర్తుచేస్తూ రానున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలుపుకు ప్రతి నాయకులు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలన్నారు.

ప్రతి నాయకుడు, కార్యకర్తకు అండగా పార్టీ ఉంటుందని, రాబోయే రోజుల్లో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత స్థానం లభిస్తుందన్నారు.

గత 12 ఏళ్ల కాలంలో ప్రజలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందిస్తూ, నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి పరచామని, రాబోయే రోజుల్లో కూడా నియోజకవర్గంలో అభివృద్ధి చెందాలంటే గతంలో పనిచేసిన మాదిరిగానే అదే స్ఫూర్తితో పట్టుదలగా పనిచేసి మళ్లీ గులాబీ జెండా రెపరెపలాడేలా ప్రతి నాయకుడు కార్యకర్త పనిచేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేశ్ యాదవ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి , సీనియర్ నాయకులు సంపత్ మాధవరెడ్డి, కిషోర్ చారి, వివిధ కాలనీలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు, ముఖ్య నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

 work hard to ensure that the pink flag flies again

You cannot copy content of this page

Scroll to Top