
Erra Krishna Jambhav : దేవరకొండ డివిజన్ మార్చ్ 17, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో స్థానిక కార్యాలయంలో దేవరకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, న్యాయవాది ఎర్ర కృష్ణ జాంభవ్ మాట్లాడుతూ తుంగతుర్తి శాసనసభ్యులు మందుల శ్యామయేల్ ఇంటి పై దాడికి బీజేపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సి సెల్ రాష్ట్ర చైర్మన్ గా పదవిబాద్యతలు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే కావాంపల్లి సత్యనారాయణ సభలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల శ్యామయేల్ మాట్లాడిన మాటలను అపార్థం, వక్రీకరణ చేసుకొని మనువాద పార్టీలు, నాయకులు వారి ఇంటిపై దాడి చేసి, అసభ్య పదజాలంతో దూషించిన వారి పై కఠిన చర్యలు తీసుకోని,వారికీ క్షమాపణలు తెలియజేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ, బీజేవైఎం నాయకుల దిష్టిబొమ్మను దహనం చేస్తామనిఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు ఓర్వలేక రాష్ట్ర నాయకులపై లేనిపోని అబండాలు మోపుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేసినటువంటి ప్రజాప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక స్థానిక ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ ప్రభుత్వాన్ని బద్నామ్ చెయ్యాలని చూస్తున్న బిజెపి నాయకులకు అదేవిధంగా బీజేవైఎం నాయకులు రాబోయే రోజుల్లో ప్రజా ప్రభుత్వంలో ఖచ్చితంగా శిక్ష తప్పని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇట్టి చర్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకొని వారిని పార్టీ నుండి సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

