Janasena Chittam Murali : పర్యావరణ పరిరక్షణే సమాజ అభివృద్ధికి మార్గం

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా(అనంతగిరి) త్రినేత్రం న్యూస్,జూన్ 6: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అనంతగిరి మండలం కొత్తవలస గ్రామంలో పర్యావరణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హార్టికల్చర్ ఆఫీసర్ జామి ఈశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చిట్టం మురళి పాల్గొని మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ — ‘‘ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతుంది. ఈ కారణంగా ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పులు వెల్లువెత్తుతున్నాయి. ప్రకృతి సమతుల్యత భంగం కావడంతో జీవవైవిధ్యం ప్రమాదంలో పడుతోంది. గిరిజన ప్రాంతాల్లో కూడా పర్యావరణంపై అవగాహన కల్పించాలి. వృక్ష సంపదను పెంపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల మొక్కలు, నీడనిచ్చే మొక్కలు సరఫరా చేస్తూ గిరిజన రైతులకు ఆర్థిక మద్దతుతో పాటు పర్యావరణ రక్షణకు తోడ్పడుతోంది’’ అని తెలిపారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా పర్యావరణ శాఖను పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో గిరిజన యువత, ప్రజలు పర్యావరణ పరిరక్షణపై మరింత చైతన్యంతో ముందుకు రావాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు పాంగి బాబీ, జనసేన నాయకులు బుజ్జి బాబు, రొంగోలి రాము, కాఫీ లైజన్ వర్కర్ అప్పన్న, రైతులు, ఉపాధి శ్రామికులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Environmental protection is the

You cannot copy content of this page

Scroll to Top