MLA Vijayaramana Rao : ప్రభుత్వ ఆసుపత్రిలో ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు

TRINETHRAM NEWS

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇందిరా మహిళా శక్తి గ్రూపుకి కేటాయించిన క్యాంటిన్ ను స్థానిక నాయకులతో, ఆసుపత్రి అధికారులతో కలిసి ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు
ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి లో ఇందిరా మహిళా శక్తి పధకం ద్వారా ఆసుపత్రి కి వచ్చి వెళ్లే ప్రజల కోసం, రోగుల కోసం ప్రభుత్వ ప్రోత్సహంతొని ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతొని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మహిళా క్యాంటిన్ ను ప్రారంభించుకోవడం జరిగింది
మహిళలకు జీవనోపాధి కల్పించడంకోసం రాష్ట్ర ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరా మహిళా శక్తి పధకం ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. మహిళా గ్రూపుల ద్వారా మహిళలకు సేవా చేసే అవకాశం రావడం చాలా గర్వకారణం అందరి సహకారంతో ఈ మహిళా క్యాంటిన్ ముందు ముందు కూడా మంచి పురోగతి సాధించాలని ఎమ్మెల్యే కోరుకున్నారు
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప,నుగుల్లా మల్లయ్య, భూతగడ్డ సంపత్,బొడ్డుపల్లి శ్రీనివాస్, ఉప్పు రాజు, బొంకురి అవినాష్, జెడల సురేందర్, దొడ్డుపల్లి జెగదీష్,ఆసుపత్రి జిల్లా సూపరింటెండెంట్ శ్రీధర్,డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Vijayaramana Rao inaugurates

You cannot copy content of this page

Scroll to Top