Janasena Holds Grand Rally : సుపరిపాలనకు ఏడాది. పీడ విరగడై ఏడాది – పాడేరులో జనసేన ఘనంగా ర్యాలీ

TRINETHRAM NEWS

అల్లూరి జిల్లా(పాడేరు) త్రినేత్రం న్యూస్ జూన్ 6: సుపరిపాలనకు ఏడాది, పీడ విరగడై ఏడాది పూర్తి అయిన సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ అధ్యక్షులు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఈ కార్యక్రమం పాడేరు జనసేన పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమైంది.
పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ వంపూరు గంగులయ్య నేతృత్వంలో బాణసంచా, డప్పు వాయిద్యాలతో ఓల్డ్ బస్ స్టాండ్ అంబేద్కర్ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి, బాణసంచా కాల్చుతూ “పీడ విరగడై ఏడాది – సుపరిపాలనకు ఏడాది” అనే నినాదాలతో శబ్దించాయి.
వైకాపా రాక్షస పాలనకు అంతం: గంగులయ్య
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో గంగులయ్య మాట్లాడుతూ, “గడిచిన ఏడాదిలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిలో పెట్టింది. ప్రజా సంక్షేమం కేంద్ర బిందువుగా అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడిపిస్తోంది. వైకాపా హయాంలో నెలకొన్న అరాచక పాలనకు జూన్ 4తో ముగింపు పలికింది,” అని చెప్పారు.
దీపావళిలా వేడుకలు – నరకాసుర పతనం భావనతో “వైకాపా ప్రభుత్వం నరకాసురునిలా ప్రజలను పీడిస్తూ పాలించిన రోజులకి ముగింపు కలగడంతో దీపావళి తరహాలో ఈ వేడుకలకు శ్రీకారం చుట్టాం,” అని గంగులయ్య పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విశాఖ రూరల్ జిల్లా ఉపాధ్యక్షురాలు కిట్లంగి పద్మ, అధికార ప్రతినిధి బొంకుల దివ్యలత, అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కొర్ర కమల్ హాసన్, పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళీకృష్ణ, ఐటీ కోఆర్డినేటర్ సీ.హెచ్. అనిల్ కుమార్, టౌన్ ప్రెసిడెంట్ మజ్జి నగేష్, సీనియర్ నాయకులు పాంగి శివాజీ, వంపూరు సురేష్, వీరమహిళ బొంకుల విజయదుర్గలత, ముదిలి సుబ్బారావు, మదాల నాగేశ్వరరావు, మజ్జి సంతోష్, కుంచె దేవేంద్ర ప్రసాద్, అయ్యప్ప పాత్రుడు, లంకెల పవన్, పాంగి సత్తిబాబు, మజ్జి సత్యనారాయణ, తల్లే త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.
పాడేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి జనసేన శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A year of good governance

You cannot copy content of this page

Scroll to Top