Employee Suicide : ఉద్యోగి సూసైడ్.. స్పందించిన ఓలా

TRINETHRAM NEWS

Trinethram News : Oct 20, 2025, సెప్టెంబర్ 28న బెంగళూరులో ఓలా ఎలక్ట్రిక్స్ ఇంజనీర్ కె. అరవింద్ (38) ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు రాసిన 28 పేజీల సూసైడ్ నోట్‌లో, కంపెనీ యజమాని భవేష్ అగర్వాల్, సీనియర్ అధికారులు తనను మానసికంగా వేధించారని, జీతం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని అరవింద్ ఆరోపించారు. అరవింద్ సోదరుడు అక్టోబర్ 6న అధికారులపై ఫిర్యాదు చేశారు. అయితే, అరవింద్ తన సమస్యలను ఎవరితోనూ పంచుకోలేదని, ఫిర్యాదు చేయలేదని ఓలా ఎలక్ట్రిక్స్ తెలిపింది. కంపెనీ కర్ణాటక హైకోర్టులో ఎఫ్‌ఐఆర్‌ను సవాలు చేయనుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Employee suicide.. Ola responds

You cannot copy content of this page

Scroll to Top