జూలై 5, 2026
TRINETHRAM NEWS
Elimination of Garbage Vulnerable Points

Elimination : త్రినేత్రం న్యూస్ : కూకట్పల్లి జూన్ 13 (త్రినేత్రం న్యూస్) : సైబరాబాద్ 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా కూకట్‌పల్లి జోన్ పరిధిలో గుర్తించిన పలు గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లు (జీవిపిఎస్) ప్రజల భాగస్వామ్యం, సమన్వయం మరియు పారిశుద్ధ్య సిబ్బంది కృషితో విజయవంతంగా నిర్మూలించబడ్డాయి.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజల సహకారంతో పాటు పారిశుద్ధ్య సిబ్బంది మరియు రామ్‌కీ సంస్థ సిబ్బంది చురుకుగా పాల్గొని పలు గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లను లక్ష్యంగా తీసుకొని శుభ్రపరిచారు.

అనంతరం ఆ ప్రదేశాలను పూలతో, రంగవల్లులతో అలంకరించి పరిశుభ్రమైన వాతావరణాన్ని సృష్టించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల నిర్మూలనపై హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ ప్రాంతాల్లో చెత్త వేయకుండా పరిశుభ్రతను కాపాడేందుకు తమవంతు బాధ్యతగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

కూకట్పల్లి – డీసీ – ఆంజనేయులు మాట్లాడుతూ పరిశుభ్రమైన పరిసరాల కోసం పౌరుల భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు. రోడ్లపై చెత్త వేయకుండా, పారిశుద్ధ్య సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని సూచించారు. సమాజం, పారిశుద్ధ్య సిబ్బంది మరియు స్థానిక సంస్థల సమిష్టి కృషితో పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన నగర నిర్మాణం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page