కడియంలో సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గోరంట్ల…
Trinethram News : మండల కేంద్రమైన కడియం గ్రామ పంచాయతీపరిధిలో రూ.2 కోట్ల 45 లక్షల వ్యయంతో నిర్మించనున్న 33బై 11కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శనివారం రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవి రామ్ కిరణ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డిఇ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ కడియం గ్రామంలో ఏళ్ల తరబడి ఉన్న లోవోల్టేజీ సమస్య, మరియు వేమగిరి సబ్ స్టేషన్ నుండి తమ గ్రామానికి వచ్చే విద్యుత్ లైన్లు కూలేందుకు సిద్ధంగా ఉన్న కరెంట్ స్తంభాలు, వేలాడుతున్న తీగల సమస్యతో తరచూ విద్యుత్ సమస్య తలెత్తుతుందని దీని పరిష్కారానికి తమ గ్రామంలో సబ్ స్టేషన్ నిర్మించాల్సిందిగా స్థానిక ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్,ఉప సర్పంచ్ నాని తన దృష్టికి తెచ్చారన్నారు.
భారీ వ్యయం అయినప్పటికీ స్థానిక అవసరాల దృష్ట్యా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు ఇక్కడ విద్యుత్ సమస్యను వివరించి సబ్ స్టేషన్ కు అనుమతులు తెచ్చానని ఎమ్మెల్యే తెలిపారు. సబ్ స్టేషన్ ను త్వరలోనే పూర్తిచేసి గ్రామానికి ప్రజలకు, రైతులకు, మెరుగైన నాణ్యమైన విద్యుత్ సేవలందిస్తామన్నారు. ఎంపిపి ప్రసాద్ మాట్లాడుతూ కడియం గ్రామంలో సబ్ స్టేషన్ ఏర్పాటుతో ఇక్కడ చిరకాలం గా ఉన్న కరెంట్ కష్టాలు, లోవోల్టేజీ సమస్యలు తీరనున్నాయని అన్నారు. సబ్ స్టేషన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గోరంట్ల కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్.ఇ తిలక్, డిఇ దాట్ల శ్రీధర్ వర్మ, కడియం కడియం ఏఇ వి.శ్రీనివాస్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


