త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. 2020 సంవత్సరంలో వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైలార్ దేవరం పల్లి గ్రామంలో విద్యుత్ శాఖలో పనిచేసే లైన్‌మెన్ అబ్దుల్ జలీల్ ఎల్‌సి తీసుకోకుండా నిర్లక్ష్యం తో కుషా రెడ్డి అనే యువకుడిని కరెంట్ పోల్‌పైకి ఎక్కించి, షాక్ తో అతని మృతికి కారణమయ్యాడు. ఇట్టి కేసులో వాదోపవాదనలు విన్న వికారాబాద్ జిల్లా ప్రిన్సిపల్ మరియు సెషన్స్ జడ్జి డా. ఎస్. శ్రీనివాస్ రెడ్డి నిందితునికి ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ. 25,000/- జరిమానా విధించడం జరిగింది అని జిల్లా ఎస్పీ స్నేహమెహ్ర తెలియజేయడం జరిగింది.
జరిమానా చెల్లించడంలో విఫలమైతే, నిందితుడు అదనంగా ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష అనుభవించవలసి ఉంటుంది.
ఇట్టి కేసులో నిందితునికి శిక్ష పడే విధంగా పని చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్: పి. సుధాకర్ రెడ్డి, మొదటి ధర్యాప్తు అధికారి అప్పటి వికారాబాద్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావు, రెండవ ఐఓ అప్పటి వికారాబాద్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, ప్రస్తుత ఇన్‌స్పెక్టర్ బి. భీమ్ కుమార్, బ్రీఫింగ్ అధికారులు ఎస్. శ్రీనివాస్, ఎస్.ఐ., సత్యనారాయణ, ఎస్.ఐ., సి డి ఓ ఎల్. నరేందర్, ఏ.ఎస్.ఐ., లైసనింగ్ అధికారులు ఎస్. శ్రీనివాస్, ఎస్.ఐ.చంద్ర శేఖర్, ఏ.ఎస్.ఐ., లను జిల్లా ఎస్పీ అభినందించడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


