హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్.
త్రినేత్రం న్యూస్, రాజమండ్రి, డిశంబర్ 8 : కాకినాడ, అమలాపురంలలో ప్రిన్సిపల్ జిల్లా కోర్టులు ఏర్పాటుకు కృషి చేస్తానని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్ట్ పోలియో జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్ హామీ ఇచ్చారు. జిల్లా పోర్టు పోలియో జడ్జిగా నియమితులైన జస్టిస్ దేవానంద్ రాజమండ్రి పర్యటించిన సందర్భంగా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్( ఐఎల్ఏ ) ఉమ్మడి జిల్లా అధ్యక్షులు టి. పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో ఐ ఎల్ ఏ ప్రతినిధి బృందం ఆర్ అండ్ బి అతిధి గృహం లో ఆయనను కలిసి పలు సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం సమర్పించింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 16 బార్ అసోసియేషన్లు, 65 కోర్టు లో ప్రతిరోజు 10 వేల మంది న్యాయవాదులు, సుమారు 50వేల మంది కక్షిదారులు వస్తూ ఉంటారని వివరించారు.
అన్ని కోర్టుల ప్రాంగణాల్లో మౌలిక వసతులు కల్పించాలని, నూతన కోర్టు భవనాలకు నిధులు మంజూరు చేయాలని, మైనర్ రిపేర్లు చేపట్టాలని, కాకినాడలో డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డిఆర్టి ) ఏర్పాటు చేయాలని, జిల్లా విభజన దృష్ట్యా అమలాపురం, కాకినాడలో ప్రిన్సిపల్ జిల్లా కోర్టులు ఏర్పాటు చేయాలని తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జస్టిస్ దేవానంద్ ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ బృందానికి హామీ ఇచ్చారు. దేవానందను కలిసిన వారిలో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాజమండ్రి అధ్యక్షులు కొత్తూరి ఆనంద కుమార్, గౌరవాధ్యక్షులు పి గణేశ్వరరావు నాయకులు జేవి రమణ, ప్రేమ్ నజీర్, కోలా శ్రీహర్రావు, బి దొరబాబు, టి ముఖేష్ తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


