WhatsApp Image 2024 02 06 at 3.56.05 PM
Trinethram News : డీల్లీ: లిక్కర్ కుంభకోణంలో దర్యాప్తును ఈడీ ముమ్మరం చేసింది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు వరుసగా సమన్లు పంపుతోంది.ఈ క్రమంలో మంగళవారం సీఎం వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌కు చెందిన పలు ప్రాంగణాల్లో తనిఖీలు చేపట్టింది. జల్ బోర్డు మాజీ సభ్యుడు శలబ్ కుమార్‌తో పాటు ఆప్‌తో సంబంధం ఉన్న పలువురికి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
