Essential Commodities Distributed : మొంథా తుఫాన్ కారణంగా

TRINETHRAM NEWS

పునరావాస కేంద్రాలలో ఉన్నవారికి నగదు, నిత్యవసర సరుకులు పంపిణీ…

త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 31. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట, మొంథా తుఫాన్ కారణంగా ప్రభుత్వం వారు ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలలో ఉన్న వార్కి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రకటించిన నగదు, నిత్యావసర సరుకులను రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, చేతులమీదిగా శుక్రవారం నేలటూరు, ఏడిద సీతానగరం గ్రామాలలో పంపిణీ చేయటం జరిగింది. కపిలేశ్వరపురం మండలం, నేలటూరు గ్రామానికి సంబంధించి మొత్తం 13 మందికి గాను 9 మందికి వెయ్యి రూపాయలు చొప్పున, 4 కుటూంబాలకు మూడు వేలు చొప్పున మరియు మండపేట మండలం, ఏడిద సీతానగరం గ్రామానికి సంబంధించి 18 మందికి గాను 14 మందికి వెయ్యి రూపాయలు చొప్పున, 4 కుటూంబాలకు మూడు వేలు చొప్పున అందించారు.

అంతేకాకుండా ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల బియ్యం, మత్స్యకార కుటుంబాలకు ప్రత్యేకించి 50 కేజీల బియ్యం అందజేశారు. బియ్యం తో పాటు ఒక లీటరు వంట నూనె, ఒక్కో కేజీ చొప్పున కందిపప్పు, చక్కెర, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, ను పంపిణీ చేశారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ తుఫాన్ సమయంలో ప్రజలకు భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. ప్రాణ, పశు, ఆస్ధి నష్టం ఉండొద్దనే కృత నిశ్చయంతో కూటమి ప్రభుత్వం పనిచేసిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్ధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, పెనుమత్స వెంకటవర్మ రాజు, ఎంపిటిసి అడ్డాల శ్రీదేవి రామరాజు, అయినంపూడి నాగరాజు, నంబూరి రామరాజు, ముధునూరి రంగరాజు, రవ్వ శ్యామ్యుల్ రాజు, మోటూరి రాజుబాబు, మేడిద భూషనం, ఆచంట రమేష్, ఇందుకూరి శ్రీనివాసరావు, పర్వతిన వీర్రాజు, ఎర్రబ్బు, రుద్రాక్షుల సోమేష్, నక్కా జనార్ధన, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Due to Cyclone Montha

You cannot copy content of this page

Scroll to Top