అల్లూరిజిల్లా అరకులోయ, జూలై 9 (త్రినేత్రం న్యూస్) : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రజా నాయకుడు డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకొని అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గంలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. అరకు వ్యాలీ మండల కేంద్రంలో వై.ఎస్.ఆర్ విగ్రహానికి నేతలు పుష్పాంజలి ఘటించి, కేక్ కట్ చేస్తూ ఆయన సేవలను స్మరించుకున్నారు. అనంతరం అరకులోయ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేస్తూ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, అరకు ఎంపీ గుమ్మా తనూజారాణి, జిల్లా పార్టీ అధ్యక్షుడు పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ఉమ్మడి విశాఖపట్నం జడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, మాజీ ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, శోభా హైమావతి, మాజీ జిసిసి చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు కొర్రా రామలక్ష్మి, రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, మాజీ సర్పంచ్ ప్రకాష్ రావు, తదితరులు పాల్గొన్నారు.
అలాగే, స్థానిక సీనియర్ నాయకులు శెట్టి అప్పాలు, మాజీ జెడ్పీటీసీలు, ఎంపిపిలు, సర్పంచులు, ఎంపిటిసీలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున హాజరై డాక్టర్ వై.ఎస్.ఆర్ సేవలను కొనియాడారు. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన డాక్టర్ వై.ఎస్.ఆర్ జయంతిని ఈవిధంగా ఘనంగా నిర్వహించడం అభినందనీయమని పలువురు నాయకులు పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


