త్రినేత్రం న్యూస్ పెనుమూరు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరమైన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూపొందించిన ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని జీడి నెల్లూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ వి.ఎం థామస్ సూచనల మేరకు పెనుమూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పెద్దినేని రుద్రయ్య నాయుడు ఆధ్వర్యంలో ఈరోజు పెనుమూరు మండలం పులికల్లు గ్రామపంచాయతీ చెర్లోపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొనగా ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి
సవివరంగా ప్రజలకు వివరించి వారందరూ ప్రభుత్వం పట్ల సానుకూలతను సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గోపాల్ నాయుడు, ఉపాధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీపీ షణ్ముఖ వర్మ, టిడిపి నాయకులు శ్రీనివాస్ చౌదరి, గుర్రప్ప నాయుడు, రాజగోపాల్ నాయుడు జయచంద్ర నాయుడు, నరేంద్ర నాయుడు, మరియు గ్రామ ప్రజలు మహిళలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


