
Dr Yekula Rajarao : దేవరకొండ డివిజన్ జూన్ 28, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని సాయి రమ్య ఫంక్షన్ హాల్ లో ఆదివారం గుండ్లపల్లి మండలం కామేపల్లి గ్రామానికి చెందిన గోరటి -శ్రీలత -సైదులు దంపతుల కుమారులు మోహిన్, చెతన్ ల నూతన పట్టు వస్త్రాలంకరణ వేడుకకు హాజరై మెమొంటోను అందజేసి చిన్నారులను ఆశీర్వదించిన టిపిసిసి ఎస్సి డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ యేకుల రాజారావు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. మోహిన్, చెతన్ లు ఉన్నత విద్యను అభ్యసించి, సంస్కారంతో , జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగి కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాల మహానాడు సోషల్ మీడియా కోఆర్డినేటర్ చేపూరి మురళి , స్థానిక ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, తదితరులు పాల్గొన్నారు ,
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe