
ఇద్దరు అరెస్ట్.. మరో ఇద్దరు పరారీ
80 kg Ganja Seized : అరకులోయ, జూన్ 29, (త్రినేత్రం న్యూస్): ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో అరకు వ్యాలీ ఐటీఐ కళాశాల గేట్ ఎదురుగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు భారీగా గంజాయి పట్టుబడింది. ముందస్తు సమాచారంతో అరకు ఎస్‌ఐ మరియు వారి సిబ్బంది ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా అరకు నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగిన కారును ఆపి తనిఖీ చేయగా, కారులో ఉన్న నలుగురు వ్యక్తులు ఒక్కసారిగా దిగి పారిపోవడానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారయ్యారు. కారును తనిఖీ చేయగా మూడు గోనె సంచుల్లో సుమారు 80 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. పట్టుబడిన వారి వివరాలు అడగగా, మొదటి వ్యక్తి కాశీం షరీఫ్ (43), మైసూరు, కర్ణాటక, రెండో వ్యక్తి సాయిబు అలీ (32), మైసూరు, కర్ణాటకకు చెందిన వారిగా వెల్లడించారు.
పోలీసులు 80 కిలోల గంజాయి, కారును, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, మధ్యవర్తుల సమక్షంలో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
గంజాయి అక్రమ రవాణా, నిల్వ, విక్రయం వంటి నేరాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రజలు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe