జూలై 23, 2026
TRINETHRAM NEWS
BRSV Action must

బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ

BRSV : దేవరకొండ డివిజన్ జూన్ 28, త్రినేత్రం న్యూస్. బుక్ స్టాల్స్ నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి అని బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ అధికారులను డిమాండ్ చేశారు. ఆదివారం దేవరకొండ పట్టణంలో సమావేశంలో ఆయన మాట్లాడుతూ……. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు,యూనిఫామ్ లు,టై బెల్ట్ లు అమ్ముతూ పేద విద్యార్థులను దోచుకుంటున్నారని ఆరోపించారు.

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని ఆయన కోరారు.ప్రభుత్వ నిబంధనలను పాటించని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి అని ఆయన కోరారు. కార్యక్రమంలో బిఆర్ఎస్వీ మండల అధ్యక్షులు పాత్లవత్ లక్ష్మణ్,జామీర్ బాబా,పేట అభి, అంజనెయులు, వెంకటేష్ , మహేష్,రవి,తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page