Explanations given by the Principals : ప్రధానోపాధ్యాయులు చెప్పిన వివరణలు

TRINETHRAM NEWS

తేదీ : 23/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం, వెలేరుపాడు , కుక్కునూరు మండలంలో ఉన్నటువంటి మండల ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల ల ప్రధానోపాధ్యాయులు రామవరం, చిర్రి .దేవరాజు, వసంతవాడ కుంజం. రాజేష్, మేడేపల్లి . సోయం. వెంకటేశ్వరరావు, కోయ మాధవరం. కట్టం. జయ, మద్ది గట్ల. మడకం. నాగమణి, లచ్చిగూడెం. బంధం. ముత్యాలరావు, ఆర్వాయిపల్లి. మడి. నాగేంద్ర, నెమలి పేట. బంధం .వెంకటేష్, బెస్తగూడెం. ఎస్. రాధా, నల్లకుంట. పి .రాధ, వంజి వారి గుంపు. బిరుదుల.

రమేష్ , కొర్లకుంట. ఏ పుష్పలత ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ పాఠశాలకు సంబంధించిన వివరములు తెలపడం జరిగింది. అన్ని పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో, కొత్తగా అడ్మిషన్ లు ఎన్ని వచ్చాయో తెలపడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం చెప్పిన సమయం ప్రకారం పాఠశాలలో నడుస్తున్నాయని, విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్య బోధన, క్రీడలు, మధ్యాహ్న భోజన పథకం ఆధారంగా సన్న బియ్యం తో కూడిన అన్నము, ఆకుకూరలు, కూరగాయలతో కూడిన కూరలు, పప్పు మరియు గుడ్లు తో పౌష్టిక ఆహార నివ్వడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు పుస్తకాలు, నోట్ బుక్స్, సంబంధిత మెటీరియల్స్, యూనిఫామ్, బ్యాగ్స్, బూట్లు ఇచ్చామని తెలిపారు.

విద్యార్థులకు రోజు విడిచి రోజు బెల్లం వేరుశనగతో తయారు చేసినటువంటి ప్రభుత్వం ఇచ్చిన చిక్కీలు, రాగి జావా అందిస్తున్నామని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ఇంత చక్కటి విద్య మరియు విద్యార్థులకు ఇచ్చినటువంటి సంబంధిత మెటీరియల్స్ ను మెచ్చుకొని, తల్లికి వందనం మరియు సూపర్ సిక్స్ పథకాలను, ప్రజలు మెచ్చుకుంటున్నారని, రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు,ఎంపీ,లు మంత్రులను అభినందిస్తున్నారని తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతున్నారని చెప్పడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Explanations given by the

You cannot copy content of this page

Scroll to Top